హైదరాబాద్, జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ మాసం బోనాల జాతరను పురస్కరించుకొని సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అనువంశిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ నెల 30 వ తేదీన ఉదయం 10గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు కమీటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి ఏటా జరిగే బోనాల ఉత్సవాలకు అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహిస్తూ వస్తున్న ఉజ్జయిని మహాకాళి దేవాలయం ఈ ఏడు నిర్వహించే జాతరకు సంబంధించి సమావేశాన్ని ఆదివారం నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జులై లో జరగాల్సిన బోనాల వేడుకలు ఇతర కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలు లష్కర్ బోనాల జాతర పండుగ పసుపు కుంకుమ కార్యక్రమం సందర్భంగా జులై 7వ తేదీన పసుపు కుంకుమ కార్యక్రమం జులై 21న బోనాలు ఉన్నట్లు తెలిపారు. సూరిటి అప్పయ్య సేవ సమితి ఆధ్వర్యంలో జరగబోయే బోనాల జాతర ఏర్పాట్లపై దేవాలయం ప్రాంగణం లో జూన్ 30 ఆదివారం ఉదయం 10గంటలకు సమావేశం వుంటుంది. కావున బంధుమిత్రులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూరిటీ కామేష్ ముదిరాజ్,సురిటి రమేష్ ముదిరాజ్, పిట్ల నగేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొననున్నారు.
- Homepage
- Telangana News
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి Temple సమావేశం !
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి Temple సమావేశం !
Leave a Comment