సర్వేయర్ల రికార్డుల నిర్వహణ పటిష్టంగా ఉండాలి : ` జిల్లా కలెక్టర్‌ Koya శ్రీ హర్ష

భూముల సర్వే సరిహద్దు రికార్డుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష అన్నారు. సోమవారం  జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష సవిూకృత జిల్లా కలెక్టరేట్‌ లోని తన చాంబర్‌ లో జిల్లాలోని సర్వేయర్ల కు నూతనంగా 8 ల్యాప్‌ టాప్‌ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ సర్వేయర్లు పని తీరు మెరుగు పర్చుకోవాలని, వారి నాణ్యమైన పనితీరుకు దోహదపడే విధంగా నూతనం గా అందించిన 8 ల్యాప్‌ టాప్‌ లను వినియో గించుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. ఈ  కార్యక్రమంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సర్వే ల్యాండ్‌ రికార్డ్‌ శ్రీనివాసులు, సర్వేయ ర్లు అనిల్‌, సునీల్‌, నరేష్‌, శ్రీనివాస్‌ కృష్ణప్రియ ,రాధిక, రాజశేఖర్‌, చారి ,రఘుపతి , సాయి చరణ్‌, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....