సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్‌ టికెట్‌ కోసం తొలి దరఖాస్తు సమర్పించిన మానవతారాయ్‌

హైదరాబాద్‌ఆగష్టు 21 (ఇయ్యాల తెలంగాణ ): శుక్రవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం హైదరాబాద్‌ గాంధీ భవన్‌ లో కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఆశావా అభ్యర్థుల దరఖాస్తు ఫారాలను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క,టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌,ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, మరో ఏఐసిసి కార్యదర్శి వంశీ చంద్‌ రెడ్డి లు విడుదల చేశారు.తొలి దరఖాస్తు ఫారాన్ని అందుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్‌ దరఖాస్తును పూరించి దరఖాస్తులో ఉన్న హావిూ పత్రాలపై సంతకం పెట్టి పార్టీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు నిర్దేశించినటువంటి 25 వేల రూపాయల డిడి ని దరఖాస్తు ఫారం తో జత చేసి సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం క్రమ సంఖ్య 116కు దరఖాస్తు చేసుకొని దరఖాస్తు ఫారాన్ని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కు అందించారు.119 నియోజకవర్గాల్లో తొలి దరఖాస్తును సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గంకు మానవతారాయ్‌ దరఖాస్తు చేసుకున్నారు.దరఖాస్తు సమర్పించేటప్పుడు మానవతరాయ్‌ వెంట సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్‌ నాయకులు ఐఎన్టీయూసీ సెంటర్‌ కౌన్సిల్‌ సెక్రెటరీ రావి నాగేశ్వరావు చౌదరి,సత్తుపల్లి మండల కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు దేశి రెడ్డి సత్యనారాయణ రెడ్డిలు, మరియు ఓయూ జేఏసీ నేతలు కొప్పుల ప్రతాపరెడ్డి, బైరి నాగరాజ్‌ గౌడ్‌,బిక్షపతి నాయక్‌ లు ఉన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి కి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు రావి నాగేశ్వరరావు చౌదరి, దేశి రెడ్డి సత్యనారాయణ రెడ్డి లు గాంధీభవన్‌ లో ఉన్న టీపీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డిని శాలువాతో సన్మానించారు. సత్తుపల్లి నియోజకవర్గ పర్యటనకు రావాలని వారు రేవంత్‌ రెడ్డిని కోరారు. రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....