సంస్కృతీ, సంప్రదాయాల ప్రతీక బోనాల పండుగ

 

హైదరాబాద్, జూలై 13 (ఇయ్యాల తెలంగాణ) :  పండగంటే సందడి..,. । అదే బోనాల పండుగ అయితే సందడే సందడి..।అందులోనూ తెలంగాణ అస్థిత్వానికి సంస్కృ తీ,సంప్రదాయాలకు ప్రతిరూపమైన బోనాల వేడుక వస్తే.. ఇక జాతరో జాతర..।ఆషాడ మాసంలో మొదలై  శ్రావణమాసం దాకా కొనసాగే ఈ నైవేద్య ఉత్సవం ఇటు గ్రామాలతో పాటు,అటు పట్టణాల్లోనూ మొదల య్యింది.స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా గుర్తింపు రావడంతో అంబరాన్నంటే సంబరాలు చేసు కునే వేళయింది.ఇప్పటికే గ్రామ దేవతలయిన గంగ మ్మ, మైసమ్మ,పోశమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మకు గడప,గడ ప నుంచి బోనం బైలెళ్ళుతున్నది.శివ సత్తుల పూనకా లు, పోతురాజుల విన్యాసాలు,డప్పు చప్పుళ్ళు, నృత్యా లతో పల్లె పల్లె తో పాటు తెలంగాణ ప్రాంతమంతా హోరెత్తుతున్నది.

బోనం అంటే భోజనం :

బోనం అంటే భోజనం..ఆహారం అని అర్థం. విస్తారంగా వర్షాలు కురిపించి పంటలు పండేలా కరుణించి, ఇంటిల్లిపాది కడుపు నిండేలా చూడాలని గ్రామ దేవత లకు కృతజ్ఞతగా భోజనం పెట్టడమే బోనం.అన్నం ప్రసాదిస్తున్న అమ్మకు నైవేద్యం పేరుతో భక్తులు చేసే వేడుకే బోనాల ఉత్సవం. బోనాల పండుగ తెలంగాణకు ప్రత్యేకం.కాకతీయుల కాలం నుంచే ఇక్కడి పల్లెల్లో బోనాలు తీయడం ఆనవా యితీగా వస్తోందన్నది చరిత్రకారుల అభిప్రాయం. పూర్వం వర్షాకాలంలో వానలు బాగా కురిసేవి. దీనితో పారిశుధ్ద్యం లోపించి కలరా,ప్లేగు,తట్టు,మశూచి,ఇతర రోగాలు వ్యాపించేవి.ఇలాంటి భయంకర వ్యాధులతో ప్రజలు అల్లాడేవారు.శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ని కాపాడుమని కొలిచేవారు.తమ పిల్లా పాపలను గొడ్డు గోదను పంటలతో పాటు ఊరు మొత్తాన్ని కాపలా కా యాలని మొక్కులు చెల్లించేవారు.ఊరంతా ఒకే రోజున పసుపు అన్నంతో బోనం చేసి సమర్పించేవారు.మహిళ లు కొత్త బట్టలు ధరించి బోనాన్ని తలపై పెట్టుకుని డ ప్పు చప్పుళ్ళ మధ్య ఊరేగింపుగా బయలు దేరి అమ్మవా రికి నయివేద్యం పెట్టేవారు.దుష్ట శక్తులను పారదోలాల ని పూర్వం దున్నపోతులను బలిచ్చేవారు.ఇప్పుడు మేక లు,గొఱ్ఱెలు,కోళ్ళను బలిస్తున్నారు.ఇలా బోనాల పండుగ నిర్వహణ అనాదిగా వస్తున్నది.

సాకలు పెట్టడం వెనుక ఉన్నది సైన్సే :

అమ్మవారికి బోనం సమర్పించడం ఎంత ముఖ్యమో దారి పొడుగునా బోనాలతో పాటు అమ్మవారి ఘటాలు, ఊరే గింపుల ముందు అమ్మవారి దేవాలయాల తలుపుల దగ్గర అమ్మవారిముందు సాకలు పెట్టడం అంతే ముఖ్యమైన విధిగా ఆచారం కొనసాగుతూ వస్తుంది.కేవలం పరిశుద్ద మైన నీటిలో వేప కొమ్మలను వేసి సాకలు పెట్టడంతో పాటు చిన్న మట్టి పాత్రలో నీళ్లు పోసి చక్కెర బెల్లం వేసి తీర్థం తయారు చేస్తారు.అందులో వేపకొమ్మలు ఉంచి బోనం పెట్టుకుని అమ్మవారి ఆలయానికి చేరుకుని సమ ర్పిస్తారు.కొన్ని చోట్ల కల్లుతో సాక చేసి గ్రామ దేవతలకు ముట్ట చెబుతారు.సాకను వివిధ ప్రాంతాల్లో వాళ్ళ,వాళ్ళ ఆచారాలను బట్టి చేస్తుంటారు.కొన్ని చోట్ల బోనం చేయ లేని స్థితిలో ఉన్న కొందరు భక్తులు కేవలం అమ్మవారికి సాక పెడితే అమ్మవారు తమను కరుణిస్తుం దని ఎంతోమంది భక్త జనుల ప్రగాఢ విశ్వాసం. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....