హైదరాబాద్, జూలై10, (ఇయ్యాల తెలంగాణ ): గత కొద్దిరోజులుగా షర్మిల రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీని స్థాపించగా.. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. వీటిని ఆమె ఖండిరచినప్పటికీ…తాజాగా రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.వైఎస్ షర్మిల…. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిగా తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ బిడ్డగానే ఉంటానని… ఇక్కడి ప్రజల కోసం పోరాడుతానంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన ఆమె… ఎన్నికల సవిూపిస్తున్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. పార్టీ స్ఖాపించిన కొత్తలో బీజేపీ డైరెక్షన్ లోనే షర్మిల పార్టీ ఏర్పాటు అన్న చర్చ జరగింది. ఇక గత కొద్దిరోజులుగా చూస్తుంటే…. వైఎస్‌ఆర్టీపీ ఏకంగా కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న అంశం తెరపైకి వచ్చింది. అంతేకాదు… కొన్ని పరిణామాలు కూడా అందుకు బలం చేకూరుస్తున్నాయి.కర్ణాటక ఫలితాల తర్వాత డీకె శివకుమార్ ను కలిశారు వైఎస్ షర్మిల. ఇక్కడ్నుంచే…. వైఎస్‌ఆర్టీపీ విలీనంపై చర్చ మొదలైంది. డీకే డైరెక్షన్ లోనే చర్చలు నడుస్తున్నాయంటూ వార్తలు వచ్చాయి. అయితే కేవలం అభినందనలు మాత్రం చెప్పటానికే కలిశానని చెప్పుకొచ్చారు షర్మిల. అంతేకాదు… విలీనం చేయాలనుకుంటే సుదీర్ఘమైన పాదయాత్ర ఎందుకు చేస్తానని కూడా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే… ఏపీసీసీ బాధ్యతలు షర్మిలకు ఇస్తారని, ఆంధ్రా రాజకీయాల్లోకి షర్మిలంటూ సరికొత్త చర్చ కూడా మొదలైంది. వీటికి కేవీపీ లాంటి నేతల కామెంట్స్ బలం చేకూర్చాయి. ఈ విలీనం, ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ వంటి పలు అంశాలపై వస్తున్న వార్తలపై స్పందించిన షర్మిల…. తెలంగాణతోనే తన జీవితమని మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ షర్మిల రాజకీయ భవిష్యతుపై చర్చ జరుగుతూనే వస్తోంది. నిజంగా కాంగ్రెస్‌లో విలీనం చేస్తే షర్మిల తెలంగాణకు పరిమితమవుతుందా లేదా ఏపీ రాజకీయాల్లో ఆమెను చొప్పిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.షర్మిల తండ్రి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.దీనికి షర్మిల కూడా థ్యాంక్స్ రాహుల్ జీ అంటు బదులిచ్చారు. గతంలో రాజశేఖర్ రెడ్డి మరణం విషయంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేశారు షర్మిల. అయితే సడెన్ గా రాహుల్ గాంధీ ట్వీట్ చేయటం, ఆమె ధన్యవాదాలు తెలుపుతూనే…. విూ నేతృత్వంలో దేశం ఉజ్వల భవిష్యత్ సాధిస్తుందనేది
- Homepage
- Telangana News
- షర్మిల స్వరం మారుతోందా…
షర్మిల స్వరం మారుతోందా…
Leave a Comment