శ్రీ చైతన్య SCHOOL CBSE కి సంబంధించిన కార్యాలయం సీజ్‌

గారెడ్డి జూన్ 28 (ఇయ్యాల తెలంగాణ ); రంగా రెడ్డి జిల్లా… ఎల్బీనగర్‌ నియోజకవర్గం లోని హస్థినాపురం డివిజన్లో జెడ్పీ రోడ్‌ లో గల శ్రీ చైతన్య స్కూల్‌ లో సీబీఎస్‌ఈ సిలబస్‌ లేకుండా అడ్మిషన్స్‌ చేశారంటూ బీసీ యువజన సంఘం నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళనకు దిగారు.  సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు సీబీఎస్‌ఈ కార్యాలయాన్ని సీజ్‌ చేశారు.

స్టేట్‌ గవర్నమెంట్‌ అనుమతి తీసుకొని సీబీఎస్‌ఈ సిలబస్‌ అనుమతి లేకుండానే మా దగ్గర నుండి వేలాది రూపాయలు ఫీజు రూపేనా తీసుకున్నారని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ని విద్యార్థిని తల్లిదండ్రులు నిలదీశారు. మరోవైపు విద్యాశాఖ అధికారులు కూడా సీబీఎస్‌ఈ సిలబస్‌ లేదంటూ నోటీసులు కూడా గోడలకు అందించడం జరిగింది. తల్లిదండ్రులు మాత్రం మాకు ఇలాంటి విషయాలు ఏవిూ చెప్పకుండా మా పిల్లల భవిష్యత్తుతో స్కూల్‌ యాజమాన్యం చెలగాట మారుతుంది అంటూ ఆందోళనకు దిగారు. కాగా బీసీ యువజన సంఘం నేతలు మాత్రం ఈ స్కూల్ని వెంటనే సీజ్‌ చేయాలంటూ దీనిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....