శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావు దంపతులు

తిరుమల ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ ); కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్‌ రావు దంపతులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున తిరుమల చేరుకున్న హరీశ్‌ దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి హరీశ్‌ రావుకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.మంత్రి హరీశ్‌ రావుతోపాటు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి , రాష్ట్ర పర్యాటక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి శ్రీనివాస రాజులు, జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ హన్సరాజ్‌ గంగారాం ,కూడా శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....