వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయాలి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

హైదరాబాద్‌ అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ): హైదరాబాద్లోని నేషనల్‌ పోలీస్‌ అకాడవిూలో 75వ బ్యాచ్‌ ఐపీఎస్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ శుక్రవారం జరిగింది. ఈ ఐపీఎస్‌ ప్రొబేషనర్ల 75వ బ్యాచ్‌ పాసింగ్‌`అవుట్‌ పరేడ్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌  షా ముఖ్యఅతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ 75వ బ్యాచ్‌ ఐపిఎస్‌ శిక్షణలో 33 మంది మహిళా ఐపిఎస్‌ లు ఉండడం గర్వకారణం, సంతోషంగా ఉంది. దేశానికి సేవఅందించడంలో ఐపీఎస్‌ లు శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. పీడిత ప్రజల అభ్యున్నతి, వారి భద్రత కోసం ఐపీఎస్‌ లు నిబద్ధతతో కృషి చేయాలని అన్నారు. వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సవాళ్లువిసురుతున్నాయి. సైబర్‌ నేరాల అదుపు, నేరగాళ్లకు చెక్‌ పెట్టడంలోనూ టెక్నాలజీ పై ఐపీఎస్‌ లు దృష్టి సారించాలి.  హవాలా, నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్టంగా పోరాడాలి.భవిష్యత్‌ లో ఎదురయ్యే ఎన్నోసవాళ్ళను ఐపీఎస్‌ లు అలవోకగా ఎదుర్కోవాలి. సైబర్‌ క్రైమ్‌, క్రిప్టో కరెన్సీ, హవాలా, నకిలీ నోట్ల, నార్కోటిక్స్‌, ఇంటర్‌ స్టేట్‌ గ్యాంగ్‌, చార్జిషీట్‌ ఫైల్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఇలా అన్ని అంశాలపై ఐపిఎస్‌ లు పట్టుసాధించాలని సూచించారు. న్యాయ వ్యవస్థలో వస్తున్న మార్పులకు అనుగుణంగా క్రిమినల్‌ జస్టిస్‌ పై దృష్టి కేంద్రీకరించాలి. అంతిమంగా ఐపీఎస్‌ లు ప్రజల భద్రత అందించడంలో మనసులు గెలవాలి. ఈ 25ఏళ్లు (అమృత్కాల్‌) మన తీర్మానాన్ని విజయవంతం చేయాలి. ప్రధాని మోదీ గారి నేతృత్వంలో అన్ని రంగాల్లో దేశం ముందుకెళ్తోంది. ఆంగ్లేయుల కాలం నాటి 3 చట్టాలను మార్చాల్సి ఉంది. సీఆర్పీసీ,ఐపీసీ, ఎవిడెన్స్‌ చట్టాల్లో మార్పులు చేయాల్సి ఉంది. మూడు చట్టాల్లో మార్పులు చేసి ప్రభుత్వం పార్లమెంట్‌ ముందు ఉంచింది. త్వరలో నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతుంది. ప్రజల అధికారాలనుసురక్షితంగా ఉంచడం కొత్త చట్టాల ఉద్దేశం. కొత్త చట్టాల ఆధారంగా అధికారులు ప్రజలకు రక్షణ కల్పించాలని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....