హైదరాబాద్ ఆగష్టు 1 :
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన మరుసటి రోజే చార్జీల బాదుడును అధికారులు షురూ చేశారు. సిటీలో డే బస్ పాస్ చార్జీలను టీఎస్‌ఆర్టీసీ పెంచింది. 100 రూపాయలున్న డే పాస్ ను 120 కు పెంచింది. గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పడు 100 రూపాయలుగా ఉంది. 80 , 100 రూపాయలు ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. రూ.120 డే పాస్ సమయంలో రోజుకి 25 వేలు మాత్రమే అమ్మకం జరిగింది. రూ.80 రూపాయల డే పాస్ సమయంలో రోజుకీ 40 వేల వరకూ అమ్మేవారు. మళ్లీ పెరిగిన టికెట్ ధరలతో బాదుడు మొదలైందని ప్రయాణికులు చెబుతున్నారు.