విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ

మంథని జులై 3,(ఇయ్యాల తెలంగాణ ):గురు పౌర్ణమిని పురస్కరించుకొని సహాయ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆద్వర్యంలో  మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన ఐటీ కన్సల్టెంట్‌ ముప్పిడి ఉదయరాజ్‌ ` సరిత (హన్మకొండ) దంపతుల సహకారం తో పుట్టపాక గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు కావాల్సిన నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లతో పాటు బిస్కెట్‌ ప్యాకెట్లను విద్యార్థినీ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రిటైర్డ్‌ టీచర్‌ కొరకొప్పుల రాజశేఖర్‌, పుట్టపాక సర్పంచ్‌ రొడ్డ మమతా శ్రీనివాస్‌, ట్రస్ట్‌ చైర్మన్‌ మేడగొని వెంకటేష్‌, స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ ప్రసన్న, శోభన్‌ బాబు, తిరుమలేశ్వర్‌,  ముప్పిడి సూతిక్షన్‌, షణ్ముకి పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....