విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి Government పాఠశాలలు : మంత్రి Sabita Indra Reddy

హైదరాబాద్‌ నవంబర్‌ 4 (ఇయ్యాల తెలంగాణ) : విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సనత్‌నగర్‌లో 2.22 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, బన్సీలాల్‌ పేటలోని ప్రభుత్వ పాఠశాలలో 1.84 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను మంత్రులు ప్రారంభించారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి మేకల మండి పాఠశాలను హై స్కూల్‌గా అప్‌ గ్రేడ్‌ చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబిత ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు పేద విద్యార్థులు అధికంగా విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో మన బస్తీ `మన బడి కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, వారానికి 3 రోజులు రాగి జావా అందిస్తున్నామని గుర్తు చేశారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....