జయశంకర్ భూపాలపల్లి ఆగష్టు 9 (ఇయ్యాల తెలంగాణ ):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా భవిష్యత్ లో ప్రకృతి పరమైన నీటి విపత్తులను ఎదుర్కొనేల రూ.600000/`లతో విపత్తు నివారణ పరికరాలను ఘణపురం మండలంలోని గణప చేరువు లో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి,జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్ పీ కరుణాకర్ , ఓ ఎస్ డీ అశోక్ కుమార్ ట్రియల్ చేశారు. అకాల భారీ వర్షాలతో జిల్లాలో చాలా వరకు వరద నష్టం వాటిల్లిన క్రమంలో సహాయక చర్యలకోసం వేచిచూడాల్సిన పరిస్థితి.భవిష్యత్లో వరద ప్రభావాలను ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అనంతరం ఇంఫ్లోటబుల్ రబ్బర్ బోట్ లో చెరువులో పర్యటన చేశారు. వరద సహాయక చర్యల కోసం వేచి చూడకుండా తాత్కాలికంగా నివారణ చర్యలు తీసుకోగలమని తెలిపారు. జిల్లా లో రెండు కేంద్రాలుగా భూపాలపల్లి, కాటారంలలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు
- Homepage
- Telangana News
- వరదల పట్ల భవిష్యత్ లో తాత్కాలిక ఉపశమనం
వరదల పట్ల భవిష్యత్ లో తాత్కాలిక ఉపశమనం
Leave a Comment