వంద ఇంటర్నేషనల్‌ అవార్డులతో బలగం

 

హైదరాబాద్‌, జూలై 5, (ఇయ్యాల తెలంగాణ ): ఏదైనా సినిమా హిట్‌ అవ్వాలంటే మంచి కథ ఉండాలి, ఆ కథను న ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా దర్శకుడు తెరపై చూపించాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాంటి సినిమానే ‘బలగం’. కమెడియన్‌ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి ఈ సినిమా తెరకెక్కించారు. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. తొలి ప్రయత్నంలోనే ఎవరూ ఊహించని హిట్‌ ను అందుకున్నారు వేణు. ఈ సినిమా మార్చి 3, 2023 న విడుదలై ఇప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉంది. ఈ మూవీకు అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కడమే కాకుండా వరుస అవార్డుల పంట పండిరది. ఇప్పటికీ ఈ సినిమాకు ఎక్కడో చోట ఏదొక అవార్డు వస్తూనే ఉంది. తాజాగా ఈ ‘బలగం’ మూవీ మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్‌ ప్రకటించారు. కమెడియన్‌ గా కెరీర్‌ ను ప్రారంభించారు వేణు ఎల్దండి. తర్వాత పలు టీవీ కామెడీ ప్రోగ్రాంలలో చేశారు. ‘బలగం’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాతో వేణు ఎల్దండిపై ప్రశంసల వర్షం కురిసింది. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు బ్యానర్‌ లో ఈ మూవీను విడుదల చేశారు. తాజాగా ఈ ‘బలగం’ సినిమా ఓ అరుదైన రికార్డును సాధించింది. మూవీ వంద అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ..‘‘మా అద్భుత ప్రయాణానికి గుర్తింపు. గతంలో 100 రోజులు ఆడే సినిమాలు ఉండేవి, తర్వాత 100 సెంటర్లలో రన్‌ అయ్యే సినిమాలు ఉండేవి, తర్వాత 100 కోట్ల వసూళ్లు చేసే సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మేము 100 కు పైగా అంతర్జాతీయ అవార్డులు పొందిన మూవీను సాధించాం. ‘బలగం’ మాకు ప్రత్యేకమైన చిత్రం’’ అంటూ పోస్ట్‌ చేశారు మేకర్స్‌. పట్టణాల్లో కంటే పల్లెటూరుల్లో ఉండే ప్రజల జీవన విధానం ఎంతో భిన్నంగా ఉంటుంది. అక్కడ వారి అలవాట్లు, కట్టుబాట్లు, ఆచారవ్యవహారాలు ఆకట్టుకుంటాయి. ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే చావు తర్వాత జరిగే తంతుని తెలంగాణ పల్లె ప్రాంతాల్లో ఆచారసంప్రదాయాలను కలగలిపి తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంటుంది. ఈ సినిమా ద్వారా మంచి మేసేజ్‌ ను కూడా అందించారు దర్శకుడు వేణు. ఈ సినిమా వరుస అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. అంతే కాదు ఇటీవల జరిగిన టిఎస్పీఎస్పీ నిర్వహించిన గ్రూప్‌ 4 పరీక్షలలో కూడా ‘బలగం’ సినిమా గురించి ప్రశ్న అడగడం కూడా విశేషం. అంతలా ఈ సినిమా ప్రభావం చూపింది. అందుకే రూ.3 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఏకంగా 26 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీలో ప్రియదర్శి, కావ్యా కల్యాణామ్‌, రూపా లక్ష్మి, సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....