లక్ష వినాయక మట్టి విగ్రహాల పంపిణీ HMDA గణపతిని ఆవిష్కరించిన మంత్రి KTR

 హైదరాబాద్‌ సెప్టెంబర్ 15 (ఇయ్యాల తెలంగాణ ):పర్యావరణ హితం కోసం గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండిఏ) తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నది ప్రతి ఏటా లక్ష మట్టి వినాయక ప్రతిమలను హెచ్‌ఎండిఏ ఉచితంగా ప్రజానీకానికి పంపిణీ చేస్తున్నది.  ఏడాది లక్ష వినాయక మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ఉదయం పురపాలక శాఖ మంత్రి  కే.టి. రామారావు మంత్రి గంగుల కమలాకర్‌, ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ చైర్మన్‌ బి.వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ శంబిపూర్‌ రాజులతో కలిసి ప్రారంభించారు.    ఈ కార్యక్రమంలో ఎంఏయుడి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, హెచ్‌ఎండిఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌, హెచ్‌ఎండిఏ అర్బన్‌ ఫారెస్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి. ప్రభాకర్‌,  హెచ్‌ఎండిఏ చీఫ్‌ ఇంజనీర్‌ బి.ఎల్‌.ఎన్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ శ్రీమతి పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.   తదుపరి తెలంగాణ సచివాలయంలో ఎంఏయుడి స్పెషల్‌ సిఎస్‌, హెచ్‌ఎండిఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో హెచ్‌ఎండిఏ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతికుమారి కి వినాయక మట్టి ప్రతిమను అందజేశారు.                                                                 

గురువారం 14వ తేదీ నుండి వరుసగా నాలుగు రోజులపాటు 24వ తేదీ నుంచి 17వ తేదీ  వరకు జంట నగరాలలోని 40 కేంద్రాలలో హెచ్‌ఎండిఏ వినాయక మట్టి ప్రతిమలను హెచ్‌ఎండిఏ యంత్రాంగం పంపిణీ చేస్తుంది

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....