రేషన్‌ డీలర్లకు గుడ్‌ న్యూస్‌

హైదరాబాద్‌, ఆగస్టు 8 (ఇయ్యాల తెలంగాణ ): తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ డీలర్లకు శుభవార్త చెప్పింది. రేషన్‌ డీలర్ల కవిూషన్‌ ను క్వీంటాల్‌ కు 70 నుంచి 140 రూపాయలకి పెంచుతున్నట్లు తెలిపింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నేడు (మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో మంత్రులు హరీశ్‌ రావు, గంగుల కమలాకర్‌ తదితరులు రేషన్‌ డీలర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రేషన్‌ డీలర్లకు హెల్త్‌ కార్డులు ఇవ్వడంతో పాటు కరోనాతో చనిపోయిన డీలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు డీలర్‌ షిప్‌ ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్‌ అంగీకరించింది.అయితే గత కొన్నాళ్లుగా రేషన్‌ డీలర్లకు భద్రత కావాలని.. ప్రభుత్వం ఇచ్చే కవిూషన్‌ స్థానంలో వయస్సుతో సంబంధం లేకుండా గౌరవ వేతనం ఇవ్వాలని రేషన్‌ డీలర్లు పోరాటం చేశారు. 21 డిమాండ్లతో ప్రభుత్వానికి పలుమార్లు వారు వినతి పత్రాలు సమర్పించారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో రేషన్‌ డీలర్ల పాత్ర కీలకమని.. రైస్‌ మిల్లర్లకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని.. రేషన్‌ డీలర్లను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.జూన్‌ 5 తరువాత సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అయితే అప్పుడు ప్రభుత్వం చర్చలు జరిపింది.. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామి హావిూ ఇవ్వడంతో వారు వెనుదిగారు. ఇక, తాజాగా రేషన్‌ డీలర్ల సంఘాలతో భేటీలో ఈ విషయాలను కేసీఆర్‌ ప్రభుత్వం వెల్లడిరచారు. ఇక, ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో తెలంగాణ సర్కార్‌ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం దగ్గర నుంచి పలు సంక్షేమ పథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వరకు అన్నీ స్పీడ్‌ గా జరుగుతున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....