రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా BRS MLA ల వాకౌట్‌

 👉 రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వాకౌట్‌

 👉 విూడియా పాయింట్‌ వద్దకు మాట్లాడేందుకు వెళ్తుండగా మార్షల్స్‌ అభ్యంతరం

 👉 విూడియా పాయింట్‌కు వెళ్ళే మార్గంలో కింద కూర్చుని ఎమ్మెల్యేలు నిరసన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఇయ్యాల తెలంగాణ) :  రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ సభ్యుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. బీఆర్‌ఎస్‌ తరఫున చర్చను ప్రారంభించిన కడియం శ్రీహరి.. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హవిూలకు.. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పాలకులు అనుసరిస్తున్న విధానాలకు సంబంధం లేదని విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీపై కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న రాద్దాంతంపై కూడా ఆయన విమర్శలు చేశారు.కడియం మాట్లాడుతుండగా కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుతగిలారు. ఓ సందర్భంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కడియం గతంలో రాజయ్య నుంచి ఉపముఖ్యమంత్రి పదవిని లాక్కున్నాడని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కూడా విమర్శలు చేశారు. దీనిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి లేచి అగ్నికి ఆజ్యం పోశారు. నల్లగొండ సభలో కేసీఆర్‌ తన గురించి అవమానకరంగా మాట్లాడారని, అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పాయింట్‌ పీకేసినా బుద్ధి మారలేదని వ్యాఖ్యానించారు. దాంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శాసనసభ నుంచి వాకౌట్‌ చేశారు.ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను మార్షల్స్‌ అడ్డుకున్నారు. సభ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్దకు మాట్లాడేందుకు వెళ్తుండగా మార్షల్స్‌ అభ్యంతరం తెలిపారు. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు విూడియా పాయింట్‌లో ప్రెస్‌విూట్స్‌కు అవకాశం లేదని అసెంబ్లీ భద్రతా సిబ్బంది తెలిపారు. కొత్త నిబంధనలు ఏంటంటూ సిబ్బందితో ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీష్‌రావు వాగ్వాదానికి దిగారు. అయితే గతంలో నుంచే ఈ నిబంధనలు ఉన్నాయని అసెంబ్లీ సిబ్బంది తెలిపారు.దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని నిరసనకు దిగారు. విూడియా పాయింట్‌కు వెళ్ళే మార్గంలో కింద కూర్చుని ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ లోపల మాట్లాడటానికి అవకాశం ఇవ్వరని… అసెంబ్లీ బయట కూడా విూడియాతో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వరా అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నినదిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....