వరంగల్, జూలై 12, (ఇయ్యాల తెలంగాణ ): స్టేషన్ ఘన్ పూర్ వివాదం ప్రగతి భవన్ కు చేరింది. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య గల కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. గత రెండ్రోజులు ఈ వివాదం మరింత ముదిరి వ్యక్తిగత విమర్శలతో పాటు సవాళ్ల వరకూ వచ్చింది. వీరిద్దరి తీరుపై బీఆర్‌ఎస్ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యే రాజయ్య బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తో మంగళవారం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై చేసిన వ్యాఖ్యలపై రాజయ్యను మంత్రి కేటీఆర్ వివరణ కోరినట్లు తెలుస్తోంది. కేటీఆర్… రాజయ్యకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకోసారి ఇలా ప్రవర్తించవద్దని వారించినట్లు తెలుస్తోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని సున్నితంగా హెచ్చరించినట్లు సమాచారం. ఇకపై ఎవరైనా అధిష్ఠానం మాట ధిక్కరిస్తే సహించేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.ఎన్నికల సమయం దగ్గర పడుతోందని, ఇకపై ఇద్దరూ కలిసి పనిచేయాలని రాజయ్యతో మంత్రి కేటీఆర్ అన్నట్లు తెలుస్తోంది. విూ ఇద్దరి వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని, ఈ వివాదం ఇంతటితో ముగించాలన్నారు. ఇద్దరు కలిసి పనిచేయాలని, లేకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని మంత్రి కేటీఆర్ రాజయ్యను హెచ్చరించినట్లు సమాచారం. కడియం శ్రీహరిని కూడా ప్రగతి భవన్ కు పిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వివాదం మరింత ముదిరింది. కడియం శ్రీహరిపై రాజయ్య అవినీతి ఆరోపణలతో పాటు వ్యక్తిగత విమర్శలు చేశారు. కడియం శ్రీహరి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని, కడియం కూతురు కావ్య కూడా కాంగ్రెస్ చేరుతున్నట్లు తనవద్ద ఆధారాలున్నాయని రాజయ్య అన్నారు. వారిద్దరూ కాంగ్రెస్ టికెట్లు అడిగారని, త్వరలోనే ఆధారాలు బయటపెడతానని రాజయ్య అన్నారు. కడియం శ్రీహరి తల్లి కులంపై రాజయ్య విమర్శలు చేశారు. కడియం పద్మశాలీ కులానికి చెందిన వాడని, అక్రమంగా రిజర్వేషన్లు అక్రమంగా పొందుతున్నారన్నారు. కడియం మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.వ్యాఖ్యలపై కడియం మండిపడ్డారు. రాజయ్య వైద్యుడే అయినా సభ్యత లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తన తల్లి కులం, తన కులం గురించి మాట్లాడడం దారుణమన్నారు. పిల్లలకు తండ్రి కులమే వస్తుందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. తల్లి మాత్రమే సత్యం, తండ్రి అపోహా అని రాజయ్య దారుణంగా మాట్లాడారని, ఈ వ్యాఖ్యలకు ఆయన ముక్కు నేలకు రాసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.రాజయ్య నియోజకవర్గంలో అవినీతికి పాల్పడ్డారని, దళిత బంధులో కవిూషన్లు దండుకున్నారని విమర్శించారు. ఇద్దరు నేతలు బహిరంగంగా తిట్లదండకం మొదలెట్టడంతో అధిష్ఠానం సీరియస్ అయ్యింది. రాజయ్యను ప్రగతి భవన్ కు పిలిచి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
- Homepage
- Telangana News
- రాజయ్యకు కేటీఆర్ వార్నింగ్
రాజయ్యకు కేటీఆర్ వార్నింగ్
Leave a Comment