హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఇయ్యాల తెలంగాణ): రాజకీయ నాయకులకు నీడలాంటీ వారు జర్నలిస్టులే అని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ముషీరాబాద్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు బొలం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ,ముషీరాబాద్ ఎమ్మెల్యే మూఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కె లక్ష్మణ్, తెలంగాణ జన సమితి పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నర్సయ్య లు హజరైనారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులకు పత్రికా స్వేచ్ఛ చాలా అవసరం అన్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే వార్తలు కొన్ని గందరగోళాన్ని స్రృష్టిస్తున్నాయని అన్నారు. భాద్యతగా,నిర్మాణాత్మకంగా వచ్చే ప్రింట్ మీడియా వార్తలే నిజమైన వార్తలుగా గుర్తించాలన్నారు. జర్నలిస్టులు కూడా వార్తలు అందించడంలో విశ్వాసం పొందాలన్నారు. విమర్శనాత్మక వార్తలు వచ్చినపుడు అధికార, అనధికార రాజకీయ పార్టీ నాయకులు వాటిని స్వాగతించాలని, అలాంటి సమయంలో జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలు సరికాదన్నారు.
అనంతరం మాజీ శాసన సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ అన్ని పార్టీలతో సమన్వయంగా పని చేస్తున్న ముషీరాబాద్ జర్నలిస్టులను సభా ముఖంగా అభినందిం చారు. ముషీరాబాద్ జర్నలిస్టులకు ఏలాంటీ సమస్యలు వచ్చినా వారికి నా సహాయ సహకారాలు ఉంటాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే మూఠా గోపాల్ అన్నారు. అనంతరం తెలంగాణ జన సమితి పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నర్సయ్య మాట్లాడుతూ, 2004లో ప్రారంభ మైన ఈ ఈ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్వవస్ధాపకుల్లో తాను ఒకరిని అని అన్నారు. 30 ఏళ్లుగా జర్నలిజంలో సేవలు అందిస్తున్న ముషీరాబాద్ వర్కింగ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కార్యక్రమం లో కార్పొరేటర్స్ సునీత ప్రకాష్ గౌడ్, రచనశ్రీ, మూఠా నరసింహ, రవిచారి, వి. శ్రీనివాస్ రెడ్డి, జైకీషన్ రావ్ నగేష్ ముదిరాజ్, ఎం, సోమయ్య, అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ వీరారెడ్డి, నరసింహ, నాగవాణి మద్దినేని వీరన్న, శివ, సంతోష్ గౌడ్, మనోహర్, కనకరాజు, అఖిలేష్, ప్రేమ్ సాగర్, గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.