రక్తదానం చేసి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడుదాం

వరంగల్‌ అక్టోబర్ 28 (ఇయ్యాల తెలంగాణ )::  రక్తదానం  చేసి మరో ముగ్గురి ప్రాణాలు కాపాడగలమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకోని వరంగల్‌ కమిషనరేట్‌ కార్యాలయములోరక్తదాన శిబిరాన్ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శనివారం ప్రారంభించారు. ఆర్మూద్‌ రిజర్వ్‌ మరియు ట్రాఫిక్‌ పోలీసుల అధ్వర్యంలో యం.జి.యం రక్తనిధి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికిఆర్మూడ్‌ రిజర్వ్‌, ట్రాఫిక్‌ విభాగాలకు చెందిన పోలీస్‌ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, ఆటో డ్రైవర్లు స్వచ్చందంగా రక్తదానం చేసారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం చేసిన పోలీస్‌అధికారులు, సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ వ్యక్తిగతంగా కలుసుకోని అభినందించడంతో పాటు వారికి పండ్లు, సర్టిఫికేట్లను అందజేసారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ పోలీసులు కేవలం శాంతిభద్రతలను పరిరక్షించడమే కాదు సేవా కార్యక్రమాల్లోను ముందు వరసలో వుంటారని, ముఖ్యంగా రక్తదానంపై వున్న ఆపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని,పోలీస్‌ సిబ్బంది తమ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్స్‌ డిసిపి దాసరి మురళీధర్‌, అదనపు డిసిపిలు సంజీవ్‌,సురేష్‌ కుమార్‌, రాగ్యానాయక్‌,ఎ.ఓ. రామకృష్ణస్వామి, ఏసీపీలు నాగయ్య, అనంతయ్య, సురేందర్‌, జితేందర్రెడ్డి, భోజరాజు, కృష్ణ, విజయ్‌ కుమార్‌, ఆర్‌.ఐలు శ్రీధర్‌, చంద్రశేకర్‌, శ్రీనివాస్‌, పర్జున్‌ రాజు, ఇన్స్స్పెక్టర్లు సీతారెడ్డి, సుజాత, వెంకన్న,శ్రీలక్ష్మీనారయణతో పాటు పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శోభన్‌, యం.జి.యం రక్తనిధి డాక్టర్‌ ఆశ, మోటివేటర్‌ కళ్యాణీతో పాటు పోలీస్‌ యూనిట్‌ వైద్యులు, ఇతర పోలీస్‌, పరిపాలన మరియుయం.జి.యం సిబ్బంది పాల్గోన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....