యోగాను జీవనవిధానంగా మార్చుకోవాలి : మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట,జూన్ 21(ఇయ్యాల తెలంగాణ ) : సిద్దిపేట లో అంతర్జాతీయ యోగా దినోత్సవం లో మంత్రి హరీష్‌ రావు పాల్గోన్‌ఆనరు. మంత్రి మాట్లాడుతూ   యోగ ను మన జీవనవిధానం గా మార్చుకోవాలి.   యోగ అన్ని రకాల వ్యాధుల కు చెక్‌ పెట్టవచ్చు.   ఈ మధ్య కాలంలో బీపీ షుగర్‌ లాంటి వ్యాధుల పెరుగుతున్నాయి.   ఆరోగ్యం కాపాడుకోవాలి … ఆరోగ్యం కోసం యోగ.   ఖర్చు లేని పని యోగ సాధన.   అందరము ఎంతో బిజీగా ఉన్నామని ఆరోగ్యాన్ని నిర్లక్షం చేస్తున్నామని అన్నారు.   ప్రభుత్వ ఆసుపత్రులలో గర్భిణీ స్త్రీలకు యోగ ఆసనాలు ప్రాణాయామం నేర్పిస్తున్నాం.   మెడికల్‌ కాలేజీలో యోగాను ఒక బాగంగా చేశామని అన్నారు.   పిల్లలకు యోగ కాన్సంట్రేషన్‌ పెంచుతుంది.  మన యోగ ప్రపంచ దేశాల లో చేస్తున్నారు.   ప్రపంచం యోగ సాధన ద్వారా ఆరోగ్యాన్ని పొందింది.  ఆరోగ్య తెలంగాణ అంటే గొప్ప వైద్య సేవలు అందించడం కాదు.రోగం రాకుండా కాపాడుకోవడం.   7.4 గ్రీన్‌ కవర్‌ తో దేశంలో మొదటి స్థానంలో ఉంది.  ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం కాలుష్యాన్ని తగ్గించడానికి అన్ని స్థాయిలలో  అమలుచేస్తున్నరని అన్నారు. క్యాన్సర్‌ పేషంట్స్‌ బ్రీతింగ్‌ ఎక్సర్సైజ్‌ చేస్తూ వారు ఆ  వ్యాధిని అధిగమిస్తున్నా రు.   ఆరోగ్యమే మహాభాగ్యము అనే సామెత ఊరికే రాలేదు.   ఆరోగ్యం కాపాడుకోవాలి లేక పోతే బీపీ, సుగర్‌ లాంటి వ్యాధులు మనిషిని క్రమంగా పాడుచేస్తుంది. `  ప్రతీ మనిషి ఇంకో పది మంది కి యోగ చేపించాలి.   సిద్దిపేట అనేక రంగాలలో అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంది ఆరోగ్యం  లో కూడా మనం ముందుండాలి.  ప్రతీ లీడర్‌ తమ తమ గల్లీలో యోగ చెపించాలి. చేసే ప్రతి వ్యక్తికి మ్యాట్‌ ఇస్తాను. ` అందరము కలిసి ఆరోగ్య సిద్దిపేట ను సాధిద్దామని అన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....