యువతలో దేశ భక్తి ని పెంపొందిస్తున్న నెహ్రూ యువ కేంద్ర నా దేశం నా మట్టి

బద్వేలు  అక్టోబర్ 20 (ఇయ్యాల తెలంగాణ ): నా దేశం నా మట్టి అద్భుతమైన కార్యక్రమం  అని ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని బద్వేలు రెవిన్యూ డివిజనల్‌ అధికారి ఆకుల. వెంకటరమణ అన్నారు. భారత ప్రభుత్వ కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ ,నెహ్రూ యువ కేంద్ర,హెచ్‌.ఎ.ఆర్‌.డి.ఎస్‌. సంస్థ ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలో  నా దేశం నా మట్టి కార్యక్రమం బద్వేలు నాగభూషణం డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో నిర్వహించారు. విద్యార్థులు, యువత  జాతీయ జెండాలు పట్టుకొని నినాదాలు చేస్తూ బారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో  మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ నా దేశం నా మట్టి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.ఇలాంటి అధ్బుతమైన కార్యక్రమాన్ని రూపొందించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మనమందరం ధన్యవాదాలు తెలిపాలని అన్నారు. భారతదేశ చరిత్ర ,సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో ఘనమైనవి అని చెప్పారు.  నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి కె.మణికంఠ మాట్లాడుతూ ప్రతి గ్రామం నుంచి సేకరించిన మట్టిని ఢల్లీలోని  అమృత్వాటిక స్మృతి వనం ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈనెల 31వ తేదీన ఈ కార్యక్రమం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తారని చెప్పారు.  ప్రతి మండలం నుండి ఒకరు ఢల్లీకి వెళతారని,కడప నుంచి కూడా వెళతారని తెలిపారు.ఎన్సిసి కమాండెంట్‌ ఆఫీసర్‌ వినయ్‌ రామచంద్ర మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎందరో మహనీయులు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారని వారందరిని స్మరించుకోవాలని సూచించారు.మాజీ సైనికులు శ్రీనివాసులు, పెంచలయ్య లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఎంపీడీవో నూర్జహాన్‌, నాగభూషణం డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, హెచ్‌.ఏ.ఆర్‌. డి.ఎస్‌ సొసైటీ అధ్యక్షులు ఎర్రంపల్లి రవి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....