సూర్యాపేట జులై 26, (ఇయ్యాలతెలంగాణ): భారీగా పోలీసులు మోహరింపు
సూర్యాపేటజిల్లమేళ్లచెరువు పరిధిలోని మైహోం సిమెంట్స్ లో ప్రమాద ఘటన వద్ద బీహార్, ఉత్తర ప్రదేశ్,పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ కు చెందిన కార్మికులు ఆందోళనకు దిగారు. మృతదేహాలనిచూపించాలని, ప్రమాద శకలాలను తొలగించాలని డిమాండ్ చేసారు. క్షతగాత్రులకు నష్టపరిహారం ఇవ్వాలని ఆందోళన చేసారు. అర్ధరాత్రి సెక్యూరిటీ గేటు వద్ద ఫర్నిచర్ ధ్వంసం చేసి, సెక్యూరిటీ పై దాడి చేసారు. దాంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.