మైనర్‌ ప్రేమజంట ఆత్మహత్య

సిద్దిపేట జులై 12, (ఇయ్యాల తెలంగాణ ): సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం  లచ్చపేటలో విషాదం నెలకొంది. బుధవారం తెల్లవారుజామున ఒక ప్రేమ జంట  ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులు భగీరథ్‌ (17), నేహా (16) ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. భగీరథ్‌ ఇంట్లో ఎవరులేని సమయంలో జంట ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు కులాలు వేరు కావడంతో తమ ప్రేమను అంగీకరించరని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....