మేడ్చల్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం.. PILOT మృతి

హైదరాబాద్‌: జులై 08 (ఇయ్యాల తెలంగాణ );హైదరాబాద్‌ మేడ్చల్‌ జిల్లా లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధి లోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కారు అదుపు తప్పడంతో శిక్షణలో ఉన్న విమాన పైల ట్‌ శ్రీకరన్‌ రెడ్డి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కారులో ఉన్న శ్రీకారన్‌ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలు స్తుంది.యాక్సిడెంట్‌ పై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌ బాడీని రికవరీ చేశారు. మృతుడు శ్రీకరన్‌ రెడ్డి స్వస్థ  లం గజ్వేల్‌ వాసిగా గుర్తిం చారు. నేరెడ్‌ విూట్‌ ప్రాంతం లో కుటుంబ సభ్యులు స్థిరపడ్డారు. బ్యాంకాక్‌ లో శిక్షణ పొందుతున్న పైలట్‌ శ్రీకరన్‌ రెడ్డి, గత వారం రోజుల క్రితం తన ఇంటికి వచ్చాడు.యాదగిరిగుట్ట కు వెళ్లి వస్తా అని ఇంట్లో చెప్పిఇవ్వాళ తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఇంట్లో నుండి బయలుదేరాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....