మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తాం : కేంద్ర మంత్రి Kishan Reddy

ములుగు, ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) : మేడారం మహా జాతర  సందర్భంగా సమ్మక్క, సారలమ్మలను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వనదేవతలను దర్శించుకున్నారు. తల్లులకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో దేశం అంత సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నాని తెలిపారు.అలాగే ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన వర్సిటీ పని చేస్తుందని తెలిపారు. మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారు. జాతీయ పండుగ విధానం అనేది ఎక్కడా లేదన్నారు. మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తామన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....