హైదరాబాద్, జూలై 14, (ఇయ్యాల తెలంగాణ ); మెడికల్ కౌన్సిల్ టెక్నికల్ సమస్యలు డాక్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్? కోసం అవస్థలు పడుతున్నారు. ఈనెల 20 వరకు రిజిస్ట్రేషన్?, రెన్యువల్స్? ఉన్నోళ్లే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులుగా టీఎస్? కౌన్సిల్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో తమ ఓటును కోల్పోతామని చాలామంది డాక్టర్లు ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇటీవల ఆన్?లైన్?లో రిజిస్ట్రేషన్ ?చేసుకోవచ్చని మంత్రి హరీశ్ రావు ఓ పోర్టల్‌ను ప్రారంభించినప్పటికీ అది వర్క్? చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. చేసేదేవిూలేక చాలామంది డాక్టర్లు రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్? కోసం కోఠిలోని కౌన్సిల్‌లో క్యూ కట్టాల్సిన పరిస్థితి దాపురించింది.ఎంబీబీఎస్? పూర్తిచేసినోళ్లు కౌన్సిల్‌లో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత.. ప్రతి ఐదేళ్లకు ఓ సారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల అర్హులకు కౌన్సిల్ ఇచ్చిన గడువు కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో ఇప్పుడు డాక్టర్లంతా ఆందోళన చెందుతున్నారు. ఆన్?లైన్? పనిచేయకపోవడంతో అడ్రస్? అప్డేట్స్?, ఈ మెయిల్?, ఫోన్ ?నెంబర్ సవరణలు చేసేందుకు వీలుండదు. దీనివల్ల ఆన్?లైన్ ?ఓటింగ్‌లో పాల్గొనే చాన్స్? ఉండదు. ఇక సరైన అడ్రస్ ?లేకపోతే పోస్టల్ బ్యాలెట్ విధానానికి కౌన్సిల్ అంగీకరించదు. దీంతో ఓట్లు మిస్ ?అయ్యే అవకాశం ఉన్నది. ప్రస్తుతం కౌన్సిల్‌కు ప్రతి రోజు ఐదారు వందల మంది వస్తుండగా, సగటున 100 మంది కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్?, రెన్యువల్స్? చేయలేకపోతున్నట్లు స్వయంగా కౌన్సిల్ ?అధికారులే అంటున్నారు. దీంతో చాలామంది ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉన్నదని సీనియర్? డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.త్వరలో జరగబోయే టీఎస్ ?మెడికల్ కౌన్సిల్ ఎన్నికలకు డాక్టర్లు సిద్ధమవుతున్నారు. ఈసారి కాంపిటీషన్? భారీగా ఉండనుంది. సాధారణ ఎన్నికల తరహాలో ఎలక్షన్లు జరిగే చాన్స్? ఉన్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు మద్దతు కోసం రిజిస్ట్రేషన్ ?డాక్టర్లను సంప్రదిస్తున్నారు. సుప్రీంకోర్టు సైతం ఆగస్టు 16 లోపు కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. దీంతో అధికారులు, డాక్టర్లు ఎన్నికలకు రెడీ అవుతున్నారు. షెడ్యూల్? విడుదలకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.మెడికల్ కౌన్సిల్‌లో 25 పోస్టులు ఉన్నాయి. వీటిలో 12 పోస్టులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగతా 13 పోస్టులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం దాదాపు రెండు నుంచి మూడు వందల మంది డాక్టర్లు పోటీలో ఉంటారు. ఎంబీబీఎస్? పూర్తి చేసి కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ ?పొందిన ఎవరైనా పోటీ చేయొచ్చు. ఒక్కో డాక్టర్ 13 మందికి ఓట్లు వేయొచ్చు. టాప్? 13 అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
- Homepage
- Telangana News
- మెడికల్ కౌన్సిల్ ఎన్నిక కోసం కసరత్తు
మెడికల్ కౌన్సిల్ ఎన్నిక కోసం కసరత్తు
Leave a Comment