ముదిరాజ్ కులస్తులను BC డి నుంచి ఏ కు మార్చాలి !

హైదరాబాద్, జూలై 01 (ఇయ్యాల తెలంగాణ) :  బీసీల కష్టాల గురించి తెలుసు కాబట్టే ఎమ్మెల్యే కె.పి వివేకానంద గౌడ్ వారి పరిస్థితిని ముందుంచారని అఖిల భారత కోహ్లీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు.  అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ముదిరాజ్ కులస్తులను బిసి డి నుంచి ఏకు మార్చాలని అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే కె.పి వివేకానంద గౌడ్ ఒక బీసీ ఎమ్మెల్యే కాబట్టి బీసీల కష్టాల గురించి అసెంబ్లీలో లేవలెత్తినట్లు పేర్కొన్నారు.  ఎమ్మెల్యే ప్రత్యేక అభినందనలతో ధన్యవాదాలు ముదిరాజులు స్థితి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. అసెంబ్లీలో సమయం తీసుకొని ముదిరాజ్ గురించి ప్రస్తావించిన ఎమ్మెల్యే  గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అఖిల భారత కోహ్లీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి డైనమిక్ యువ నాయకుడు రేవంత్ రెడ్డి వీలైనంత త్వరలో ముదిరాజుల సమస్య పరిష్కారానికి ఆశిస్తున్నట్లు తెలిపారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....