ముంపు ప్రాంతాలను పరిశీలించిన CLP నేత భట్టి విక్రమార్క

భద్రాద్రి, జులై 29 (ఇయ్యాల తెలంగాణ) : కొత్తగూడెం` భద్రాచలం మధ్యన కిన్నెరసాని నది బ్రిడ్జి నుంచి గోదావరిలో కొట్టుకుపోయిన నాగారం చెక్‌ డ్యామ్‌ ను సిఎల్పీ నేత భట్టి విక్రమార్క శనివారం పరిశీలించిన అనంతరం విూడియాతో మాట్లాడారు.రెండు సంవత్సరాల క్రితం రూ.16 కోట్లతో నిర్మాణం చేసిన చెక్‌ డ్యామ్‌  గోదావరి వరదల్లో కొట్టుకుపోవడం నాసిరకంగా నిర్మాణం చేయడమే కారణం. చెక్‌ డ్యామ్‌ నిర్మాణం చేస్తున క్రమంలో ఇక్కడి ప్రజలు చాలాసార్లు అధికారుల వద్దకు వెళ్లి నాసిరకంగా నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు సంబంధిత అధికారులు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను ఎవరు పట్టించుకోలేదని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం, నాసిరకంగా కాంట్రాక్టర్‌  చేసిన నిర్మాణం వల్ల  గోదావరి నదిలో చెక్‌ డ్యామ్‌ కొట్టుకుపోయి ప్రజాధనం వృధా అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం అనేక వాగులపై నిర్మించిన చెక్‌ డ్యామ్‌ లు వరదల్లో కొట్టుకుపోయాయి. 15 సంవత్సరాల కిందట నిర్మాణం చేసిన చెక్‌ డ్యామ్‌ లను  ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన క్రమంలో చూశాను.  ఇంకా అవి అలాగే పటిష్టంగా, గట్టిగానే ఉన్నాయి.  బిఆర్‌ఎస్‌ పాలనల్లో వేలాది కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన చెక్‌ డ్యాముల వరదల్లో కొట్టుకుపోవడం వల్ల ఆ నిధులు నీళ్లలో పోసినట్టుగా అయింది.

బిఆర్‌ఎస్‌ నాయకుల కోసమో.., కార్యకర్తల లబ్ధి కోసమో ఈ చెక్‌ డ్యామ్‌ లను డిజైన్‌ చేసి ప్రభుత్వం అప్పగిస్తే నాసిరకంగా కట్టడం వల్ల రాష్ట్రంలో వందలాది చెక్‌ డ్యాములు నిర్మాణం కోసం వెచ్చించిన ప్రజల సంపద వేల కోట్ల రూపాయలు ఇలా నీళ్లలో పోసినట్టుగా అయ్యిందని అన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని సమయాత్తం చేయకపోవడం వల్ల, వాళ్లను పాలన పరంగా వరద సహాయక చర్యల్లో పాల్గొనే విధంగా అప్రమత్తం చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరదల వల్ల ప్రాణనష్టం జరిగిన సంఘటనలు వెలుగు చూశాయి. ఇది చాలా దురదృష్టకరం. దీనికి బాధ్యత ప్రభుత్వ వైఫల్యం.ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళ పని, వాళ్ళని చేసుకోనివ్వకుండ, బిఆర్‌ఎస్‌ పార్టీకి పనికొచ్చేటువంటి యంత్రాంగంగా, ప్రభుత్వ యంత్రాంగాన్ని మార్చడం వల్ల, ప్రజల కోసం పనిచేయడం వదిలి పెట్టి రాజకీయ పార్టీ కోసం పని చేసే యంత్రాంగంగా మారడం వల్ల, ఇలాంటి విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందడం వల్ల ప్రజలు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రజలు దీన్ని గమనించాలి.ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా మిగతా కార్యకలాపాలు బంద్‌ చేసి పాలన యంత్రాంగం  పై సవిూక్ష చేయాలి.

 వరద ప్రాంతాల్లో ముంపునకు గురవుతున్న ప్రజలకు కావలసిన సహాయక చర్యలు అందించడమే కాకుండా నివారణ కావలసిన ప్లానింగ్‌, ఆలోచన చేయాలని అన్నారు.

వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు అధికారులను వెంటనే పంపించి నష్టం అంచనా వేయించి నష్టపోయిన ప్రజలకు తగు నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలకు వెంటనే నష్టపరిహారం అందించని పక్షంలో పెద్ద ఎత్తున నష్టపోయిన ప్రజలు అహకారాలతో రాష్ట్రంలో పాలన లేదన్న మానసిక వేదనకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ప్రజలకు ఇచ్చిన హావిూలు మర్చిపోవడం వెన్నతో పెట్టిన విద్య. గత సంవత్సరం భద్రాచలం ముంపు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి రూ. 1000 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి ఏడాది కావస్తున్నది. సీఎం మాటలు నీటి మూటలే తప్ప అమలుకు నోచుకోలేదని అయన ఆరోపించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....