ముందు జాగ్రత్తగా KCR రెండో స్థానంలో పోటీ Y S షర్మిల

హైదరాబాద్‌ఆగష్టు 22 (ఇయ్యాల తెలంగాణ ):గజ్వేల్‌ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థమైనట్టుందని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల వ్యాఖ్యానించారు.  అందుకే ముందు జాగ్రత్తగా రెండో స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.   స్వయానా ముఖ్యమంత్రి కే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేకపోవడంవిశేషం.  కేసీఆర్‌ పదేళ్ల దిక్కుమాలిన పరిపాలనకు నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి సంకేతం. దొర ఇన్నాళ్లు గజ్వేల్‌ ప్రజలను కలిసింది లేదు.   వాళ్ల గోసలు తెలుసుకున్నది లేదు.   పేరుకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు రాకపాయే.  దళిత బంధు అందకపాయే.    ఇక దొర గజ్వేల్‌ లో చూపెట్టే అభివృద్ధి అంతా ఖాళీ బిల్డింగులే.  రాష్ట్రానికే ముఖ్యమంత్రిని అన్న అహంకారంలో   కేసీఆర్‌ గజ్వేల్‌ కి ఎమ్మెల్యే అన్న సంగతి ఏనాడో మరిచిపోయిండని అన్నారు. కేసీఆర్‌ కు నిజంగా దమ్ముంటే.. తన పరిపాలన విూద తనకు నమ్మకం ఉంటే,   సొంత నియోజకవర్గం గజ్వేల్‌ నుంచే గెలిచి చూపించాలని సవాల్‌ చేస్తున్నామని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....