మిర్చి కాటాలో Hi – Tech మోసం

   👉 రిమోట్‌ తో కాటాను నియంత్రిస్తున్న వ్యాపారులు

    👉  పట్టుకొని దేహశుద్ధి చేసిన  రైతులు

     👉 మిర్చి కాటాలో హైటెక్‌ మోసం

ఖమ్మం,ఫిబ్రవరి 15 (ఇయ్యాల తెలంగాణ) : ఆరుగాలం కష్టపడి పంట పండిరచిన రైతన్నలకు ఏదో ఒకచోట దగా జరుగుతూనే ఉంది. రాత్రి పగలు కష్టపడి పండిరచిన మిర్చి పంటలు సరిగా దిగబడి లేక దిగాలు పోయిన రైతన్నలు,పండిరచిన పంటను అమ్మేందుకు వెళ్లి చివరకు వ్యాపారుల చేతిలో మోసపోతున్నారు. తాజాగా రైతులను మిర్చి కాటా వేస్తూ రైతులను మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చండ్రుగొండ మండల పరిధిలోని బెండల పాడు గ్రామంలో మిర్చి కాటాను రిమోట్‌ కంట్రోల్‌ తో నియంత్రిస్తూ హైటెక్‌ మోసానికి పాటుపడుతున్న ఇద్దరు వ్యాపారులను రైతులు పట్టుకున్నారు. తల్లాడ మండలం మల్లారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యాపారులు గత నాలుగు రోజులుగా మండల పరిధిలోని బెండలపాడు బాలికుంట గ్రామాల్లో  మిర్చికి క్వింటకు 19వేల రూపాయలు చెల్లించి రైతులు వద్ద నుండి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో మిర్చి విక్రయించిన రైతులకు వ్యాపారులపై అనుమానం వచ్చింది.
రోజు లాగానే గ్రామంలోకి మిర్చి కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యాపారులు ఓ రైతు వద్ద మిర్చి కొనుగోలు చేసి 25.53 క్వింటాలు అయినట్టు రైతుకు రసీదు ఇచ్చి ఆ మిర్చీని ఒక ట్రాలీ ఆటోలో లోడ్‌ చేసుకొని తరలిస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన రైతులు ఆ ట్రాలీ ఆటోను ఓ వే బ్రిడ్జి వద్ద తూకం వేయించగా ఆ తూకంలో 31.10 క్వింటాలు రావడంతో దాదాపు 5 క్వింటాలు పైగా  అధికంగా ఉండటంతో గమనించిన రైతులు వ్యాపారులను నిలదీశారు. ట్రాలీ డ్రైవర్‌ ట్రాలీని వదిలిపెట్టి పారిపోవడంతో ఆ ట్రాలీని వ్యాపారులను రైతులు గ్రామానికి తరలించారు. వ్యాపారులపై చేయి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న చండ్రుగొండ పోలీసులు బెండలపాడు గ్రామానికి చేరుకొని మిర్చి వ్యాపారులను  అదుపులో తీసుకొని స్టేషన్‌ తరలించి విచారణ చేపట్టారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....