హైదరాబాద్ ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ ):మాదన్నపేట్ మార్కెట్ లో ఓ ముఠా దొంగ సొసైటీలు సృష్టించి అక్రమ పార్కింగ్ కు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం పై గతంలో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. కానీ అక్రమ దారులు నిరంతరం కొత్త వ్యహాలతో కోర్టును, పోలీసులను, జీహెచ్‌ఎంసిఞ వ్యవస్థలకు చుక్కలు చూపిస్తున్నారు. ఓ తరుణంలో జీహెచ్‌ఎంసి అధికారులు కోర్టు ద్వారా అక్రమ పార్కింగ్ పేపర్లు సరి కావని నిరూపించి మూసివేశారు. మళ్ళీ ఈ అక్రమ పార్కింగ్ దళారులు వసూళ్లు పాల్పడటంతో పోలీసులకు పట్టించారు. కానీ 10 నిముషాల్లో పోలీసులు వదిలేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మార్కెట్ ఎవరి పేరు విూద ఉన్నది…ఏ దొంగ సొసైటీ అక్రమాలకు పాల్పడుతుంది?…అసలు నగరంలో పార్కింగ్ వ్యవస్థ ఉన్నదా…ఉంటే ఏ డాక్యుమెంట్లతో అనుమతులు పొందాలి…నియమనిబంధనలు ఉండాలి చూడాల్సిన బాధ్యత పోలీసులకు , జీహెచ్‌ఎంసికి ఉన్నది..కానీ ఎన్ని వ్యవస్థలు ఉన్న ఫలితం ఏమిటి…అక్రమాదారులకు పంట పండుతుంది…ఇకనైనా పోలీసులు, జీహెచ్‌ఎంసి స్పందించి చట్టపరంగా వ్యవస్థలకు న్యాయం చేసి అక్రమాదారులను అరికట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైతులను, వ్యాపారస్తులను బెదిరిస్తున్న ఓ ముఠా
జీహెచ్‌ఎంసి , పోలీసులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోకపోవడం తో పలు అనుమానాలు
100కు పిర్యాదు చేసి అక్రమపార్కింగ్ దారులను పట్టించారు..
కానీ కొద్దీ సేపటికే వదిలేయడంతో మళ్ళీ వసూళ్లు
దొంగ సొసైటీ సృష్టించి పోలీసులను, కోర్టులను, జీహెచ్‌ఎంసి వ్యవస్థలను మోసం చేస్తున్న అక్రమపార్కింగ్ దారులు
మాదన్నపేట్ పోలీసు స్టేషన్లో ఘటన