మహిళల నూతన చట్టాల గురించి అవగాహన కల్పించిన : ADCP మల్లారెడ్డి

సిద్దిపేట, జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) :  టౌన్‌ ఇన్స్పెక్టర్‌ విద్యాసాగర్‌, మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ దుర్గ, మరియు సిద్దిపేట షీటీమ్‌ బృందం అధ్వర్యంలో మహిళల నూతన చట్టాలపైఆవగాహన కార్యక్రమం జరిగింది. అడిషినల్‌ డిసిపి మల్లారెడ్డి మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్‌ లో భాగంగా మహిళల రక్షణకు పోలీస్‌ కమిషనర్‌  ఆదేశానుసారం ప్రత్యేక షెడ్యూల్లో భాగంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సోషల్‌ విూడియా, సైబర్‌ నేరాలతో జాగ్రత్తగా ఉండాలి సైబర్‌ నేరాలు మన తప్పిదాల వల్లే జరుగుతున్నాయి  గుర్తుతెలియని వ్యక్తులు పంపించే లింకులు ఓపెన్‌ చేయవద్దు, గూగుల్‌ పే ఫోన్‌ పే  ద్వారా డబ్బులు పంపించేటప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, బ్యాంకు అధికారులు ఎవరూ మన వివరాలు ఎప్పుడు కూడా అడగరు, బ్యాంకు ఖాతా ఓకే ఓపెన్‌ చేసేటప్పుడే  మన ఆధార్‌ కార్డు పాన్‌ కార్డు  అన్ని వివరాలు ఐడి ప్రూఫ్‌ తీసుకొని మనకు అకౌంట్‌ ఇస్తారు, వాళ్లు ఎప్పుడు కూడా ఆ వివరాలు అడగరు, ప్రతి ఒక్కరూ ఇది గమనించాలి. ఇలా అడిగి ఎవరైనా ఫోన్‌ చేస్తే తప్పకుండా సైబర్‌ నేరమని వెంటనే ఆ ఫోన్‌ కట్‌ చేసి వచ్చిన నెంబర్‌ ను బ్లాక్‌ చేయాలి. ఫైబర్‌ నేరాల బారిన పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.

షీటీమ్‌ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి, ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి,  ఇవి టీజింగ్‌, గుడ్‌ టచ్‌, బాడ్‌ టచ్‌ తదితర అంశాల గురించి, సోషల్‌ విూడియా దాని యొక్క పరిణామాల గురించి, సైబర్‌ సెక్యూరిటీ, మైనర్‌ డ్రైవింగ్‌, డయల్‌ 100 ప్రాముఖ్యత, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి, సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌, సెల్ఫ్‌  డిఫెన్స్‌,  మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్‌ విూడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి. గతంలో జరిగిన నేరాల గురించి నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి. భరోసా సెంటర్లో ఫోక్సో కేసులలో 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవల గురించి. మహిళలు గృహహింసకు వరకట్నం గురించి శారీరకంగా మానసికంగా హింసించే  తదితర అంశాల గురించి స్నేహిత మహిళా సెంటర్లో నిర్వహించే కౌన్సిలింగ్‌ గురించి వివరించారు. విద్యార్థులు యొక్క గోల్‌ గురించి. అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలని అంశాల గురించి. యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, మరియు తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి విద్యార్థినిలకు వివరించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశ చాలా కీలకమని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి  క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలని సూచించారు. జులై 1 నుండి అమలైన నూతన చట్టాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. మరియు ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడిరచిన వెంటనే డయల్‌  100, లేదా సిద్దిపేట షీ టీమ్‌ నెంబర్‌ 8712667434 కాల్‌ చేసి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇన్స్పెక్టర్‌ దుర్గ, త్రీటౌట్‌ ఇన్స్పెక్టర్‌ విద్యాసాగర్‌, స్కూల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ అర్షియా, మరియు అధ్యాపకులు, సిద్దిపేట షీటీమ్‌ బృందం కిషన్‌, ఏఎస్‌ఐ, మహిళా కానిస్టేబుళ్లు  మమత, వీణకుమారి, కానిస్టేబుళ్లు ప్రవీణ్‌, లక్ష్మీనారాయణ. మరియు తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....