సికింద్రాబాద్, ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : మహిళలు విద్యను అభ్యసిస్తే కుటుంబ మంతా విద్యావేత్తలుగా మారుతారని, భూగోళంలో మహిళలు సగ భాగమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ వర్మ అన్నారు.ఈస్ట్ మారేడ్పల్లిలోని కస్తూరిబా డిగ్రీ కళాశాల 50వ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ సి సి క్యాడేట్ల నుండి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. కస్తూరిబా డిగ్రీ పీజీ కళాశాల ప్రారంభమై 50 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల కస్తూరిబా కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారితోపాటు ఈ వార్షికోత్సవంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు,బహుమతులు అందజేశారు.. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ మాట్లాడుతూ కస్తూరిబా డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థినిలు ప్రతి ఏటా విద్యతోపాటు ఇతర కార్యక్రమాలలో గొప్ప మైలురాళ్లు అధిగమిస్తున్నారని కితాబిచ్చారు.మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని మహిళలు అన్ని రంగాలలో గొప్పగా రాణిస్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ విద్యార్థినిలు మహిళలు గొప్ప ఆవిష్కరణలు చేశారని ఆయన అన్నారు. స్వామి వివేకానంద జీవితాన్ని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని ఆయన బాటలో నడవాలని సూచించారు. మహాత్మా గాంధీ భార్య పేరిట నెలకొల్పిన ఈ కళాశాలలో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. వికసిత భారత్ లక్ష్యంగా దేశం దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
- Homepage
- Telangana News
- మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు : Governor జిష్ణు దేవ వర్మ
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు : Governor జిష్ణు దేవ వర్మ
Leave a Comment