మన చెత్త`మన బాధ్యతకు శ్రీకారం చుట్టిన మంత్రి హరీష్‌ రావు

   

సిద్దిపేట జూలై 24 (ఇయ్యాల తెలంగాణ ):మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలిగించిన  మంత్రి హరీష్‌ రావు  వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. చెత్తవల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సిద్దిపేటలో (మన చెత్త`మన బాధ్యత అంటూ ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 18వ వార్డులో నడుస్తూ మురికి కాలువలో పేరుకుపోయిన పేపర్లు, కవర్లను స్వయంగా తొలగించారు. చెత్త పేరుకుపోవడంతో అపరిశుభ్రమైన వాతావరణం ఉంటుందని చెప్పారు. ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో దోమల నివారణ కార్యక్రమంలో భాగంగా కోకాపేటలోని తన నివాసంలో పరిసరాలను శుభ్రం చేసిన విషయం తెలిసిందే. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన కుటుంబం, సమాజం సాధ్యమవుతుందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా లేకున్నా, నీటి నిల్వ ఉండటంతో దోమలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు. వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని సూచించారు. పూల కుండీలు, కొబ్బరి చిప్పల్లో నిల్వఉండే నీళ్లలో దోమల లార్వా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటే ప్రతీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఆరోగ్యం విషయంలో నివారణ కంటే జాగ్రత్త ఉత్తమం అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. వ్యాధులు రాకుండా ముందుగా జాగ్రత్త పాటించడం వల్లనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని చెప్పారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....