మద్యం దుకాణాలకు 21న లాటరీ

హైదరాబాద, ఆగస్టు 4, (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రంలో వచ్చే రెండేళ్లకుగానూ రిజర్వ్‌వుడ్‌ వైన్‌ల కేటాయింపు ప్రక్రియ గురువారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 షాపుల్లో 1,834 దుకాణాలు ఓపెన్‌ కేటగిరీలో ఉన్నాయి. గౌడ్‌లు, ఎస్సీ, ఎస్టీలకు 786 దుకాణాలను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇందులో గౌడ్‌లకు 393 (15 శాతం), ఎస్సీలకు 262 (10 శాతం), షెడ్యూల్డ్‌ ఏరియా ఎస్టీలకు 95, నాన్‌ షెడ్యూల్డ్‌ ఎస్టీలకు 36, మొత్తం 131 (5 శాతం) షాపులను కలెక్టర్లు రిజర్వ్‌ చేశారు. 2023`25 కాలానికి సంబంధించి మద్యం దుకాణాల లైసెన్స్‌కు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. శుక్రవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. ఈ నెల 21న ఓపెన్‌ లాటరీ నిర్వహించి దుకాణాలను కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒకే వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే రిజర్వ్‌డ్‌ షాపులకు ఆయా వర్గాలకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ఫీజును డీడీ రూపంలో కానీ, చలాన్‌ రూపంలో కానీ చెల్లించవచ్చు. 

జిల్లాల వారీగా నిర్ధారిత కేంద్రాల్లో దరఖాస్తులు ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు. నాంపల్లిలో ఎక్సైజ్‌ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.ఎక్సైజ్‌ శాఖ వచ్చే రెండేళ్ల (2023`25) మద్యం దుకాణాలకు లైసెన్స్‌ మంజూరు ప్రక్రియను నిన్న ప్రారంభించిన విషయం తెలిసిందే. మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదే నెల 21న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. అయితే.. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో పూర్తవుతున్నది. దీంతో కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. దుకాణాల సంఖ్య, రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగనున్నాయి. దరఖాస్తు రుసుం గతంలో మాదిరిగానే రూ.రెండు లక్షలుగా (నాన్‌ రిఫండబుల్‌), స్పెషల్‌ రీటెయిల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌ (ఎస్‌ఆర్‌ఈటీ)ను రూ.5 లక్షలుగా నిర్ధారించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....