వైన్ షాపును ధ్వంసం చేసిన కుటుంబ సభ్యులు
హైదరాబాద్,జులై 5 (ఇయ్యాల తెలంగాణ) :
నాచారంలోని కనకదుర్గ వైన్స్కు వచ్చిన నాగి అనే వ్యక్తి మద్యం తాగిన అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అతడిని వైన్స్ నిర్వాహకులు బయట పడేశారు. అనంతరం అతను మృతిచెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య, కుటుంబ సభ్యులు కలిసి వైన్స్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం భార్య వైన్స్ షాపులోకి వెళ్లి మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.