మంత్రి KTR అడ్డుకున్న కాంగ్రెస్‌ నేతలు

కామారెడ్డి ఆగష్టు 14 (ఇయ్యాల తెలంగాణ ):సోమవారం నాడు కామారెడ్డి చేరుకున్న మంత్రి KTR కు, నర్సన్న పల్లి  బైపాస్‌ వద్ద ఘనస్వాగతం లభించింది. న స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తదితరులు అయనకు స్వాగతం పలికారు. ముందుగా మంత్రి కేటీఆర్‌ మున్సిపల్‌ స్వాగత తోరణాన్ని ప్రారంభించారు. హౌసింగ్‌ బోర్డు, ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ ను ల ఆవిష్కరించారు.  మంత్రికి  BRSశ్రేణులు బైక్‌ ర్యాలీ తో స్వాగతం పలికారు.అంతకుముందు మంత్రి KTR నిరసన సెగ తగిలింది. కామారెడ్డి జిల్లా దేవునుపల్లి వద్ద ఆయన కాన్వాయ్ని కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొంతసేపు అక్కడ గందరగోళం ఏర్పడిరది.. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....