మంత్రి సబితను అడ్డుకున్న అంగన్వాడీలు

రంగారెడ్డి సెప్టెంబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ); మహేశ్వరంలో విద్యా శాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి కాన్వాయ్‌ ను అంగన్వాడీ టీచర్లు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు  మహిళలపై విరుచుకుపడ్డారు.పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్వాడీలో మంత్రి కాన్వాయ్‌ రోప్‌ పార్టీ పోలీసులను తరిమారు. మహిళా  పోలీసులు లేకుండా అంగన్వాడీల టీచర్లపై పోలీసులు చేతులు వేసారని ఆరోపించారు.  మహేశ్వరం పట్టణంలో రోడ్డుపై బైఠాయించారు.` గత కొద్ది రోజులుగా సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ` మంత్రి సబితా ఇంద్రారెడ్డి కనీసం స్పందించకపోవటంపై సిగ్గుచేటని వారు విమర్శించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....