మంత్రి కేటీఆర్‌ కు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు

 
 బస్సుపై సాధించిన ప్రగతిని వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేత అలిశెట్టి అరవింద్‌

హైదరాబాద్‌  24, (ఇయ్యాల తెలంగాణ ): రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ కు ఆ  పార్టీ నేత అలిశెట్టి అరవింద్‌ వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 12 అడుగుల ఎత్తు 45 అడుగుల వెడల్పు కలిగిన భారీ  బస్సుకు ఇరువైపులా మంత్రి కేటీఆర్‌ సాధ్యంలో సాధించిన విజయాలను వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టీ హబ్‌, దుర్గం చెరువు ఫ్లైఓవర్‌, టీ వర్క్స్‌, నగరంలోని పలు ఫ్లైఓవర్లను ఇందులో పొందుపరిచారు. దేశంలోనే తొలిసారి తొలిసారిగా ఈ తరహా శుభాకాంక్షలు తెలిపిన నేతగా అలిశెట్టి చరిత్రలో నిలిచిపోనున్నారు.  ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన ఈ వాహనం నేటి ఉదయం 6 గంటల నుంచి పది రోజులపాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో సంచరిస్తుంది. మాటల్లో కాదు అతి తక్కువ కాలంలో అభివృద్ధిని చేసి చూపించిన తమ నేత కలకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నట్లు అలిశెట్టి పేర్కొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....