భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

 

    మున్నేరు వాగు వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్‌

మహాబుబాబాద్‌ జూలై 26 (ఇయ్యాల తెలంగాణ ): మహబూబాబాద్‌ జిల్లాలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ స్థానిక ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌తో కలిసి మున్నేరు వాగు వరద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.అలాగే పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. మహబూబాబాద్‌లోని పలు కాలనీల్లో నీళ్లు నిలిచిన చోట అధికారులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు సాధ్యమైనంతవరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శశాంక, ఎస్పీ శరద్‌ చంద్ర పవార్‌, మున్సిపల్‌ చైర్మన్‌ డా.రామ్మోహన్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....