బస్సు బైకు డీ?ఒకరు మృతి

మేడ్చల్‌ ఆగష్టు 22 (ఇయ్యాల తెలంగాణ ): బస్సు ను బైక్‌ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జీనోమ్‌ వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధిపేట జిల్లా ధమారకుంట వరదరాజుపురం కు చెందిన సంపత్‌( 26) యూజె ఫార్ములా కంపెనీ లో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం డ్యూటీ నిమిత్తం వెళ్తుండగ కొల్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రధాన రహదారి పై తుర్కపల్లి నుండి ఎదురుగా వస్తున్న కర్కపట్ల ఫార్మా కంపెనీ బస్సు,  ద్విచక్ర వాహనం రెండు ఢీ కొనడంతో వాహనం పై ఉన్న సంపత్‌ కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.  ఘటనలో ఒక్కసారిగా ద్విచక్ర వాహనం నుండి మంటలు చెలరేగి బస్సు కు కూడా అంటుకోవడంతో రెండు దగ్ధం అయ్యాయి. స్థానికుల సమాచారం తో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేకున్నారు. అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు  అక్కడికి చేరుకున్న మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....