ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ అడిగితే కోర్టుకు వెళ్ళమన్న రామడుగు MRO !

రామడుగు, జూలై 29 (ఇయ్యాల తెలంగాణ) :  రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన పొన్నం శ్రీనివాస్‌ గౌడ్‌ అవసరాల నిమిత్తం ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ కోసం గత కొద్ది రోజుల క్రితం శ్రీనివాస్‌ గౌడ్‌ రామడుగు తహసిల్దార్‌ కార్యాలయంలో అర్జీ పెట్టుకోగా కుటుంబ సభ్యుల సర్టిఫికెట్‌ కావాలంటే కోర్టుకు వెళ్లాలని ఎమ్మార్వో భాస్కర్‌ ఉచిత సలహాలు ఇచ్చారని పొన్నం శ్రీనివాస్‌ గౌడ్‌  ఈ సందర్భంగా గోపాల్‌ రావు పేటలో సోమవారం పాత్రికేయుల ముందు ఆయన గోడు వెళ్ళ పోశాడు. కుటుంబ అవసరాల నిమిత్తం ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ అర్జీ పెట్టుకుంటే ఎమ్మార్వో భాస్కర్‌ బ్యాంకు లావాదేవీల కోసం కుటుంబ సభ్యులు సర్టిఫికెట్‌ జారీ చేస్తామని మరి ఏ ఇతర పనులకు సర్టిఫికెట్‌ కావాలంటే కోర్టును ఆశ్రయించమనడం చాలా బాధాకరమని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. అధికారులు జారీ చేయాల్సిన సర్టిఫికెట్‌ దానిని కోర్టు ద్వారా తీసుకోమనడం ఎంతవరకు సమంజసం అన్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలని బిజెపి కార్యవర్గ సభ్యులు పొన్నం శ్రీనివాస్‌ గౌడ్‌ పత్రిక ముఖంగా తెలియజేశారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....