హైదరాబాద్, జూలై 7, (ఇయ్యాల తెలంగాణ ):
సౌత్ సెంట్రల్ రైల్వేకు గుర్తు తెలియని వ్యక్తి ఇటీవల బెదిరింపు లేఖ రాశాడు. త్వరలో బాలాసోర్ తరహా ఊహకందని ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతుందని ఫ్రమ్ అడ్రస్ లేని ఆ లేఖలో పేర్కొన్నారు. వారంలో ఒడిశా తరహాలోనే ప్రమాదం జరుగుతుందని బెదిరింపులకు పాల్పడ్డాడు. హైదరాబాద్ ? ఢల్లీి మార్గంలో ఘటన జరుగుతుందని హెచ్చరించాడు. ఆగంతకుడి నుంచి దాదాపు నాలుగు రోజుల క్రితం ఈ వార్నింగ్ లెటర్ అధికారులకు చేరింది. దాంతో వెంటనే అలెర్టయిన అధికారులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల కిందట రైల్వే అధికారులు తమకు సమాచారం అందించారని నార్త్‌జోన్ డీసీపీ చందనాదీప్తి చెప్పారు. లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారు అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. లేఖ వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను బస్సుల్లో తరలిస్తున్నారు అధికారులు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని బోగీలు మంటల్లో కాలిబూడిదవగా.. ప్రయాణికులు అప్రమత్తమై దిగిపోయారు. మిగిలిన బోగీలతో ట్రైన్ సికింద్రాబాద్ చేరుకోగా.. అక్కడే ఉండిపోయిన ప్రయాణికులను తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేశారు.రైల్లో మంటలు చెలరేగగానే అంతా బయటకు పరుగులు తీశారనీ చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. మంటల్ని గుర్తించగానే బ్యాగులు చేతుల్లోకి తీసుకుని అంతా కిందకు దూకేశామంటున్నారు. ఆ సమయంలో పరిస్థితి భయానకంగా కనిపించిందనీ చెబుతున్నారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే తాము అక్కడికి చేరుకున్నామని ఔఆఖీఈ సిబ్బంది తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో తమకు కలెక్టర్ కార్యాలయం నుంచి తమకు సమాచారం అందిందని వెల్లడిరచారు.
సిగిరెట్ తాగడం వల్లనే ప్రమాదం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైళ్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వరుసగా మూడు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో రైళ్లో మంటలు చెలరేగినట్టుగా సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి దగ్గర ఘటన జరిగింది. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే రైళ్లోంచి కిందకు దిగిపోవటం ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది సైతం హుటాహుటినా స్పందించారు. రెండు బోగిల్లోంచి ప్రయాణికుల్ని వెంటనే కిందకు దింపేయటంతో ప్రాణనష్టం తప్పింది.హౌరా నుంచి సికింద్రాబాద్ బయల్దేరిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యాపించిన మంటలు క్షణాల్లోనే రెండు బోగీలకు అంటుకున్నాయి. రైలు నిండా దట్టంగా అలుముకున్న పొగలతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే రైల్లోంచి కిందకు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.
క్షేమంగా చేరిన బాధితులు యాదాద్రి జిల్లాలో బొమ్మాయిపల్లి పగిడిపల్లి మధ్య ప్రమాదం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎస్3, ఎస్4, ఎస్5, ఎస్6 బోగీల్లో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని వెంటనే గ్రహించిన అధికారులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఇలా ప్రమాదంలో ఎవరికీ ఏవిూ కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ప్రమాదం కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడిరచింది. సికింద్రాబాద్ ` రేపల్లె, సికింద్రాబాద్ ` మన్మాడ్ వెళ్లాల్సిన రైళ్లను రద్దు చేశారు. తిరువనంతపురం ` సికింద్రాబాద్, రేపల్లె ` సికింద్రాబాద్ రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. సికింద్రాబాద్ ` తిరువనంతపురం, సికింద్రాబాద్ ` హౌరా, విశాఖపట్నం ` లింగంపల్లి, నర్సాపూర్ `నాగర్ సోల్ రైళ్లను దారి మళ్లించారు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన రైల్లోని ప్రయాణికుల కోసం.. ఘటనా స్థలం నుంచి రైల్వే అధికారులు ప్రత్యేకంగా 12 బస్సులను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రయాణికులను సికింద్రాబాద్ పంపించారు. అక్కడి నుంచి వారి వారి ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో హెల్స్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. ప్రమాదం జరిగిన రైల్లో వచ్చిన ప్రయాణికుల గురించి, వారి బోగుగుల గురించి తెలుసుకునేందుకు 040`27786140, 86170, బీఎసఎన్‌ఎల్ ` 040`27801111 నంబర్లకు ఫోన్ చేయాలని వివరించారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మొత్తం ఆరు బోగీలు దగ్ధమయ్యాయి. ఎస్`4, ఎస్`5, ఎస్`6, ఎస్`7 బోగీలు కాలి బూడిదయ్యాయి. బోగీల్లో పొగ గమనించగానే లోకో పైలెట్ ట్రైన్‌ను నిలిపివేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులంతా రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. అగ్నిప్రమాదానికి గురైన బోగీలను రైలు నుంచి విడదీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పగిడిపల్లి ` బొమ్మాయిపల్లి మధ్యలో రైలు సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఓ వ్యక్తి అప్రమత్తమై చైన్ లాగాడు. దీంతో ప్రయాణికులంతా హుటాహుటిన రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. మంటల్లో ఆరు బోగీలు పూర్తిగా తగులబడిపోయాయి.