ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు

బట్ట సంచులే వాడాలి :మున్సిపల్‌  కమిషనర్‌ ఎండీ ఆయాజ్‌

కోరుట్ల, ఏప్రిల్ 27 (ఇయ్యాల తెలంగాణ) : ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తే చర్యలు తప్పవని , పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బట్ట సంచులే వాడాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఎండి అయాజ్‌ సూచించారు..గురువారం మున్సిపల్‌ కమిషనర్‌ ఎండి అయాజ్‌ ఆదేశాల మేరకు పట్టణంలోని కిరాణా దుకాణాలు, ప్లాస్టిక్‌ ఏజెన్సీ లు, ఇతర షాపులను మున్సిపల్‌ అధికారులు దాడులు నిర్వహించారు.. ఈ సందర్భంగా కొన్ని దుకాణాల్లో నిషేధిత ప్లాస్టిక్‌ స్వాధీనం చేసుకొని జరిమానా విధించారు. అలాగే బట్ట సంచుల వాడకంపై అవగాహన కల్పించారు… ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ సానిటరీ ఇన్స్పెక్టర్‌ గజానంద్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ ప్రవీణ్‌ కుమార్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ ఆకు అంజయ్య,ఎన్విరాన్మెంటల్‌ ఇంజనీర్‌ మహేష్‌, మెప్మా సిఓ శివ కుమార్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....