ప్రాణాలు తీస్తున్న గుండెపోటులు

కరీంనగర్‌, ఆగస్టు 18, ఇయ్యాల తెలంగాణ ;  తమ్ముడి మరణంతో కుమిలిపోతూ ఆ అన్న చివరి తంతు నిర్వహించే పనిలో నిమగ్నమయ్యాడు. ఉన్నట్టుండి ఆయన కూడా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. అన్నాదమ్ములిద్దరూ గుండెపోటుతో మృతిచెందారు. ఒకే ఇంట్లో 12రోజుల తేడాలో విషాదం అలుముకుంది. ఇద్దరు కొడుకుల మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరి రోధనతో ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ విషద సంఘటన కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం రేణికుంట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఉమ్మెంత చంద్రారెడ్డి చిన్న కుమారుడు మదుసూధన్‌ అలియాస్‌ మధుకర్‌ రెడ్డి(26) హైదరాబాద్‌ లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆగస్టు 3న మధుసూధన్‌ గుండెపోటుకు గురై ఆకస్మికంగా మృతి చెందడంతో చంద్రారెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.అయితే చంద్రారెడ్డి పెద్ద కుమారుడు శ్రీకాంత్‌ రెడ్డి (30) కరీంనగర్‌ లో ప్రైవేటు జాబ్‌ చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. తమ్ముడు మధుసూధన్‌ హఠణ్మారంతో ఇంటికి చేరుకున్న శ్రీకాంత్‌ తమ్ముని చిన్నకర్మ రోజున గుండెపోటుకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో షాకుకు గురైన చంద్రారెడ్డి కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాంత్‌ రెడ్డిని హైదరాబాద్‌ నిమ్స్‌ కు తరలించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పది రోజులకు పైగా మృత్యువుతో పోరాడిన శ్రీకాంత్‌ రెడ్డి కూడా కన్నుమూశాడు. ఈ విషయం తెలిసిన చంద్రారెడ్డి కుటుంబంగ్భ్భ్రాంతికి గురైంది. చెట్టంత కొడుకులిద్దరూ కళ్లముందే కానరాని లోకాలకు తరలి వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల మనో వేదనను తీర్చే వారు లేకుండా పోయారు.పక్షం రోజుల వ్యవధిలోనే వారసులిద్దరిని కోల్పోయిన చంద్రారెడ్డి కుటంబ పరిస్థితి విన్న ప్రతి ఒక్కరూ కూడా షాక్‌ కు గురవుతున్నారు. విధి ఆడిన నాటకంలో తల్లిదండ్రులకు బాసటగా నిలవాల్సిన బిడ్డలు ప్రాణాలు కోల్పోయిన తీరు గురించి గ్రామస్థులు మాట్లాడుకుంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. ఇటీవల.. వయస్సు తో సంభందం లేకుండా గుండె పోట్లు వస్తున్నాయి.. పని వొత్తిడి కారణంగా.. ఇలాంటి.. మరణాలు సంభవిస్తున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....