ప్రధానిని కలిసిన బండి ఫ్యామిలీ

న్యూఢల్లీ, ఆగస్టు 3, (ఇయ్యాల తెలంగాణ ):ప్రధాని మంత్రి నరేంద్ర మోదీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి కలిశారు. కాసేపు వీరు కలిసి సరదాగా ముచ్చటించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత తొలిసారి ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగానే బండి సంజయ్‌ పార్టీకి అందించిన సేవలను గుర్తు చేశారు. బండి సంజయ్‌ వల్లే పార్టీలో కొత్త జోష్‌ కనిపిస్తోందని.. అలాగే చాలా మంది బీజేపీలోకి వచ్చేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఈక్రమంలోనే బండిని అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పని చేయాలని సూచించారు. 
అందర్నీ కలుపుకుని ముందుకు సాగుతూ.. ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ సందర్భంగానే బండి సంజయ్‌ కుటుంబ సభ్యులంతా ప్రధాని మోదీతో కలిసి ఫొటోలు దిగారు. అప్పుడు ఏం చదువుతున్నారు, ఎలా ఉన్నారంటూ బండి కుమారులను యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.  ఇదే విషయాన్ని బండి సంజయ్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. ప్రధాని మోదీతో తన కుటుంబ సభ్యులు కలిసి దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. ఈరోజు తాను జీవితాంతం గుర్తుంచుకోవాల్సి రోజు అంటూ రాసుకొచ్చారు. తన కుటుంబ సభ్యుల కోసం ప్రధాని కేటాయించిన ప్రతీ సెకను తనకు చాలా ప్రత్యేకమని చెప్పుకొచ్చారు. ఇదే తనకు అసలైన బహుమతి అంటూ వివరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....