ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి హాజరయిన KCR

హైదరాబాద్‌ జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) : :మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నేడు అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన అసెంబ్లీకి రావడం ఇదే తొలిసారి. దాదాపు ఏడు నెలల తర్వాత ఆయన అసెంబ్లీలో కాలు పెట్టారు. ఆయన అధికారం కోల్పోయాక అసెంబ్లీకి రావడం ఇదే మొదటిసారి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి రావడం ప్రత్యేకతను సంతరించుకుంది.  ఆయన కాసేపు తన ఛాంబర్‌ లో ఎంఎల్‌ఏలతో మాటామంతీ నెరిపారు. ప్రతిపక్షంగా ఎలా మాట్లాడాలి అన్న వ్యూహాన్ని వారికి తెలిపారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కూర్చున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....