ప్రతిపక్షాలపై మంత్రి హరీష్‌ రావు ఫైర్‌

సంగారెడ్డి జులై 10,(ఇయ్యాల తెలంగాణ ):  ప్రతిపక్షాలపై మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు.  సంగారెడ్డిలో అయన విూడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ తో పేగుబంధం వుంది.  తెలంగాణ పై ఫేక్‌ ప్రేమ ప్రతిపక్షాలది ఫెవికల్‌ ప్రేమ కేసీఆర్‌ ది. ఎన్నికలు రాగానే అధ్యక్షులు మార్చుతున్నారు.  ఔట్‌ డేటెడ్‌ లీడర్లను చేర్చుకున్న విూకు ఓటమి తప్పదు. విూ ప్రయత్నాలు ఫలించావు..ప్రభంజనం బీఆర్‌ఎస్‌  దే. కాంగ్రెస్‌ వాళ్ళు కర్ణాటకలో  600 పెన్షన్‌ ఇచ్చి ఇక్కడ ఫెక్‌ మాటలు చెబుతున్నారు. విూరు గెలిచిన కర్ణాటక లో ముందు 4 వేల పెన్షన్‌ ఇవ్వండి. ఢల్లీిల గులాం గిరి చేయడానికి బీజేపీ, కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలే మాకు  హై కమాండ్‌. ప్రతిపక్ష  నాయకులు ఢల్లీిలో బటన్‌ ఒత్తితే ఇక్కడ యాక్షన్‌ చేస్తారు. ఢల్లీికి తెలంగాణ ఆత్మగౌరవం కుదవపెట్టాల్సిన అవసరం లేదు. ప్రధాని మోడీ కోచ్‌ ఫ్యాక్టరీ కావాలంటే వ్యాగన్‌ యూనిట్‌ ఇచ్చారు. 20 వేల కోట్ల కోచ్‌ ఫ్యాక్టరీ ఎక్కడ 5 వేల కోట్ల వ్యాగన్‌ ఫ్యాక్టరీ ఎక్కడ. గుజరాత్‌ కి లడ్డు తీసుకుపోయి తెలంగాణ కి పిప్పర్‌ మెంట్‌ ఇచ్చారు. సహజంగా ఇచ్చే కేటాయింపులకు బిజెపి వాళ్ళు చంకలు  గుద్దుకుంటున్నారని అయన అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....