పేదల కల.. డబుల్‌ బెడ్రూం ఇండ్లు – పేదలకు ఇండ్లు అందించే వరకు మా పోరాటం

 

హైదరాబాద్‌ జులై 31, (ఇయ్యాల తెలంగాణ ):  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

మహబూబ్‌ నగర్‌ లో జరిగే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ ర్యాలీ లో పాల్గొనేందుకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మహబూబ్‌ నగర్‌ బయలుదేరారు. కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ పేదల కల.. డబుల్‌ బెడ్రూం ఇండ్లు  పేదలకు అందించే వరకు మా పోరాటం సాగుతుంది . రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెప్పి పేదలను మోసం చేసింది. కేంద్రం ‘పీఎం ఆవాజ్‌ యోజన’ కింద ఇచ్చే నిధులను ఏం చేస్తున్నారు. ఇండ్లు కట్టరు.. కట్టిన వాటిని అర్హులకు పంచరు. కట్టిన ఇండ్లు పాడవుతున్నా పేదలకు ఇవ్వకపోవడం కేసీఆర్‌ అహంకారానికి నిదర్శనమని అన్నారు.

కిషన్‌ రెడ్డికి శంషాబాద్‌ లో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....