పెద్దపల్లి ASSEMBLY కన్వీనర్‌ పిన్నింటి రాజు మరణం బాధాకరం.

కరీంనగర్‌ జులై 2 (ఇయ్యాల తెలంగాణ ); బీజేపీ పెద్దపల్లి అసెంబ్లీ కన్వీనర్‌ పిన్నింటి రాజు మరణం అత్యంత బాధాకరంమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు.  పిన్నింటి రాజు ప్రజల మనిషి. కార్యకర్తలకు, సామాన్యులకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం క్రుషి చేసే పిన్నింటి రాజు ఇక లేరనే వార్త కలిచి వేస్తోందని అన్నారు.బెజ్జంకి మండలం తోటపల్లికి చెందిన పిన్నింటి రాజు కుటుంబం పెద్దపల్లిలో స్థిరపడిరది. బీజేపీలో సామాన్య కార్యకర్త గా మొదలై టౌన్‌ ప్రెసిడెంట్‌, జిల్లా కార్యదర్శిసహా అనేక పదవులు చేపట్టారు. రైతులు, కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ పని పడ్డా వారికి అండగా ఉంటూ తనవంతు సాయం అందించే వారు. అధికారులు, నాయకులకు సైతం తలలో నాలుకలా ఉండే పిన్నింటి రాజు మరణం పార్టీకి, పెద్దపల్లి నియోజకవర్గానికి తీరని లోటని అన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....